ఆ హీరోయిన్ పై ఫైర్ అవుతున్న టీచర్స్

Published on Jul 17, 2019 9:31 am IST

హీరోయిన్ జ్యోతిక దర్శకుడు గౌతమ్ రాజ్ దర్శకత్వంలో “రాక్షసి” అనే చిత్రం చేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ విద్యావ్యవస్థపై సెటైరికల్ కధాంశంతో ఈ మూవీ తెరకెక్కిన నేపథ్యంలో తమిళనాడు ఉపాధ్యాయ సంఘాలు ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరం తెలియజేయడంతో పాటు, ఈ చిత్రంలో నటించిన జ్యోతికపై మరియు చిత్ర దర్శక నిర్మాతలపై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో పిర్యాదు చేయడం జరిగింది.

విధ్యార్ధుల భవిష్యత్ నాశనం కావడానికి ఉపాధ్యాయులే ముఖ్య కారణం అని,ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అధిక జీతాలు తీసుకుంటూ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారని,వీరు విధ్యార్ధులపై సరైన శ్రద్ధ చూపించకపోవడం వలనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటుపడుతూ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారన్నట్లుగా చూపించారు. దీనితో ఆగ్రహానికి గురైన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరో కొందరు చేసిన తప్పులకి, నిబద్దతతో పనిచేసే వారిని కూడా కించపరిచేలా ఈ చిత్రంలోని సన్నివేశాలు,డైలాగ్స్ ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :