విశాల్ సూపర్ హిట్ సీక్వెల్ లో తమన్నా

విశాల్ సూపర్ హిట్ సీక్వెల్ లో తమన్నా

Published on Jun 25, 2015 6:30 PM IST

vishal
తమిళంతో పాటు తెలుగులో కూడా విశాల్ కి స్టార్డం తెచ్చిపెట్టిన సినిమా ‘పందెం కోడి’. లింగుస్వామి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. గత కొద్ది రోజులుగా లింగుస్వామి ఈ సినిమా సీక్వెల్ కి కథ రాసే పనిలో ఉన్నాడు. లింగుస్వామి చెప్పిన లైన్ నచ్చడంతో విశాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమాలో హీరోయిన్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.

మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ కోసం లింగుస్వామి మిల్క్ బ్యూటీ తమన్నాని అప్రోచ్ అయ్యాడు. లింగుస్వామి చెప్పిన లైన్ తనకి నచ్చడంతో తమన్నా కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే డేట్స్ అడ్జస్ట్ చేసి తమన్నా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. తమన్నా గతంలో లింగుస్వామి డైరెక్షన్ లో ‘ఆవారా’ సినిమాలో నటించింది. ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది. విశాల్ ప్రస్తుతం సుసీంధ్రన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తవగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

ప్రస్తుతం తమన్నా ‘బాహుబలి’ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత తమన్నా కూడా ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు