ఆగడు షూటింగ్ మొదలు పెట్టిన తమన్నా

Published on Jan 23, 2014 11:20 am IST

tamanna
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆగడు’. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 18 నుంచి హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో జరుగుతోంది. నిన్నటి నుంచి తమన్నా కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ‘నిన్ననే ఆగడు సెట్స్ లో మొదటి రోజు, చాలా ఆసక్తిగా జరిగింది. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని’ తమన్నా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. ‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్ల – మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శ్రీనువైట్ల కూడా దూకుడుకి మించి సినిమాలో కామెడీ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :