ఆగస్ట్ లో విడుదల కి సిద్దంగా ఉన్న తనీష్ “మహా ప్రస్థానం”

Published on Jul 12, 2021 1:04 pm IST

జాని దర్శకత్వం లో తనీష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహా ప్రస్థానం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఓంకారేశ్వర సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రం అన్ను కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదల కి సిద్దం అవుతుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో రూపొందించిన చిత్రం గా ఇది నిలవనుంది. అయితే ఈ చిత్రం ను ఆగస్ట్ లో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్లు ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాక సాయి ధరమ్ తేజ్ విడుదల చేసిన టీజర్ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీ గా ఈ చిత్రం ఉంటుంది అని తెలిపారు.సినిమా ఆద్యంతం ఒక మూడ్ లోకి, కొత్త ప్రపంచం లోకి తీసుకు వెళ్తుంది అంటూ చెప్పుకొచ్చారు.అయితే సింగిల్ షాట్ పాటర్న్ లో ఎలాంటి కట్స్ లేకుండా తెరకెక్కించిన చిత్రం అని అన్నారు.సినిమా కథ అంతా నేచురల్ గా ఒక ఫ్లో లో కనిపించేలా షూట్ చేసినట్లు తెలిపారు.అయితే థియేటర్ లో ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నట్లు తెలిపారు. ఈ చిత్రం రిలీజ్ కి రెడీ గా ఉందని, ఆగస్ట్ లో థియేటర్లలో మహా ప్రస్థానం ను విడుదల చేస్తాం అని అన్నారు. అయితే ఈ చిత్రం లో ముస్కాన్ సేథీ హీరోయిన్ గా నటిస్తోంది. వరుడు ఫేం భాను శ్రీ మెహ్రా, కబీర్ దుహన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మాటలు వసంత్ కిరణ్, యానాల శివ అందించగా, పాటలు ప్రణవం రాశారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :