మరో క్రేజీ ప్రాజెక్ట్ లోకి తాప్సీ… స్వరూప్ దర్శకత్వం లో

Published on Jul 6, 2021 10:54 am IST

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. అదే కోవకు చెందిన వారు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్ర దర్శకుడు స్వరూప్. ప్రస్తుతం స్వరూప్ మిషన్ ఇంపాజిబుల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రకటించనప్పటి నుండి పరీక్షల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రం లోకి తాజాగా తాప్సీ పన్ను చేరడం జరిగింది. ఇప్పటికే భిన్న కథాంశాలతో తన కంటూ ప్రత్యేకత చాటుకున్నారు తాప్సీ. అయితే ప్రస్తుతం ఈ చిత్రం లో తాప్సీ చేరడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్వరూప్ RSJ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి లు మ్యాట్ని ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :