జూన్ 14న విడుదల కానున్న తాప్సి “గేమ్ ఓవర్” మూవీ

Published on May 17, 2019 5:18 pm IST

తాప్సి పన్ను ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ “గేమ్ ఓవర్” జూన్ 14న విడుదల కానుంది. నయన తార కథానాయకిగా వచ్చిన “మాయ” మూవీని తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజ్ ఐన మూవీ టీజర్ చిత్రం పై అంచనాలు పెరిగేలా చేసింది. కథ మొత్తం ఓ వీడియో గేమ్ చుట్టూ తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషలలో విడుదల కానున్న ఈ మూవీ హిందీ వెర్సషన్ ని ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ విడుదల చేయనున్నారు.
వైనాట్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి సంగీతం యాన్ రోహన్ అందించారు. గతంలో తాప్సి మహి రాఘవ దర్సకత్వంలో వచ్చిన “ఆనందో బ్రహ్మ” హారర్ కామెడీ మూవీలో నటించారు. గత కొన్నాళ్లుగా కేవలం బాలీవుడ్ పైనే ఫోకస్ చేసిన తాప్సి మళ్ళీ “గేమ్ ఓవర్” మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

సంబంధిత సమాచారం :

More