ఆర్ఎక్స్ 100 రీమేక్ కి హీరోయిన్ ఫిక్స్ !

ఆర్ఎక్స్ 100 రీమేక్ కి హీరోయిన్ ఫిక్స్ !

Published on Mar 26, 2019 6:39 PM IST

గత ఏడాది తెలుగులో విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది ఆర్ఎక్స్ 100. బోల్డ్ లవ్ స్టోరీ నేపథ్యంలో అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ లో కానుంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి ఈ సినిమా తో హీరోగా పరిచయం కానున్నాడు. సాజిద్ నడియాద్ వాలా నిర్మించనున్న ఈ చిత్రాన్ని మిలాన్ లుథ్రియా డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రంలో స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 ఫేమ్ తార సుతారియా హీరోయిన్ గా నటించనుంది. తర్వలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు