యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ సినీ విమర్శకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది ?’ చిత్రం నిన్న శుక్రవారం విడుదలైంది. చిత్రాన్ని స్పెషల్ ప్రీమియర్ల ద్వారా వీక్షించిన క్రిటిక్స్ కొందరు చిత్రం బాగుందని, తరుణ్ భాస్కర్ తమ మ్యాజిక్ చూపించారని ప్రశంసించగా ఇంకొందరి నుండి పెద్దగా పాజిటివ్ స్పందన దక్కలేదు.
సినిమాపై కొన్ని ఘాటైన విమర్శలు కూడ వచ్చాయి. దీనికి స్పందించిన తరుణ్ భాస్కర్ విమర్శకులు ఇచ్చే రివ్యూలపై తాను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నానని, ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుందని, కానీ రివ్యూ ఇవ్వడానికి కనీసం ఒక్క ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ అయినా చేసి ఉండాలని, స్క్రీన్ ప్లే రాయడంలో, సినిమా మేకింగ్ కు సంబందించిన ఇతర అంశాల్లో వాళ్ళ తెలివి జీరో అని అన్నారు.


