మన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో తరుణ్ భాస్కర్ కూడా ఒకరు. కేవలం దర్శకుడు గానే కాకుండా నటుడుగా కూడా మెప్పించారు. రీసెంట్ గానే ఓం శాంతి శాంతి శాంతి సినిమాతో మెప్పించగా ఈ సినిమా తర్వాత నటుడుగా తన నుంచి అనౌన్స్ అయ్యిన లేటెస్ట్ చిత్రమే ‘గాయపడ్డ సింహం'(Gaayapadda Simham). దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా లేటెస్ట్ గానే టైటిల్ ని ఓ పోస్టర్ తో అనౌన్స్ చేసేసారు.
ఇక ఈ సినిమా తాలూకా టీజర్ కి కూడా డేట్ లాక్ చేశారు. దీనితో ఈ సినిమా టీజర్ ని మేకర్స్ ఈ ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే అమెరికా బ్యాక్ డ్రాప్ లో సాగే కామెడీ సినిమాగా కనిపిస్తుంది. అలాగే టైటిల్ కింద బాలయ్య ఫేమస్ డైలాగ్ ని క్యాప్షన్ గా పెట్టడం విశేషం. మరి ఈ సినిమాపై ఒక ఐడియా రావాలంటే ఈ 9 వరకు ఆగాలి. ఇక ఈ సినిమాకి సప్త అశ్వ సినిమాస్ అలాగే పి ఓ వి స్టోరీస్, జీ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


