బిగ్ బాస్ 5 లో ఈ సారి టాస్క్ లు మరింత సవాల్ గా!

Published on Aug 29, 2021 10:34 pm IST

బిగ్ బాస్ 5 సీజన్ కొరకు ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. స్టార్ మా ప్రకటించినట్లు గా సెప్టెంబర్ 5 న ఈ కార్యక్రమం మొదలు కానుంది. అయితే గత సీజన్ లాగా కాకుండా, ఈ సారి టాస్క్ లు మరింత సవాల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. సాధారణం గా ఉండే టాస్క్ లు కాకుండా ఈ ఏడాది కంటిస్తెంట్ లకు మరింత సవాల్ తో కూడిన టాస్క్ లు ఉండటం తో షో మరింత ఆసక్తి కరంగా ఉండే అవకాశం ఉంది.

ఈ ఏడాది తెలుగు బిగ్ బాస్ లో ప్లాన్ చేస్తున్న టాస్క్ లు హిందీ బిగ్ బాస్ లో ఉన్న మాదిరి గా ఉండే అవకాశం ఉంది. వివిధ టాస్క్ లు మానసికంగా, శారీరకం గా సవాల్ తో ఉండేలా ఉండనున్నాయి. ఈ ఏడాది టీఆర్పీ సైతం అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని యాజమాన్యం భావిస్తున్నారు. బిగ్ బాస్ 5 కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 5 న సాయంత్రం 6 గంటలకు ఎపిసోడ్ ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం :