టీజర్ తో రెడీ అయిన విజయ్ దేవరకొండ !

విడుదలకు సిద్దమఅవుతున్న విజయ్ దేవరకొండ నూతన చిత్రం ‘టాక్సీవాలా’. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ బ్యానర్లు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్కెఎన్ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మాళవిక శర్మ, ప్రియాంక జావల్కర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితమే ఫస్ట్ గేర్ పేరుతో రిలీజైన చిన్నపాటి వీడియో ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా ఇప్పుడు ఈ చిత్రం యొక్క టీజర్ విడుదలకు సిద్దమైంది. ఈ నెల 17న తేదీన టీజర్ ప్రేక్షకుల ముందుకురానుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.