‘బిగ్ బాస్’ సెట్ లో ప్రమాదం.. ఓ వ్యక్తి మృతి !
Published on Sep 10, 2018 3:15 pm IST

అన్ని భాషల్లో ఎంతో పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ షో సెట్ లో ఈ రోజు ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ తమిళ వెర్షన్ల సెట్ లో పనిచేస్తున్న సాంకేతిక నిపుణుల్లో గుణశేఖరన్ అనే వ్యక్తి పని చేస్తూనే.. హౌస్ రెండవ అంతస్తు నుంచి కిందకి పడిపోయాడు. బాగా ఎత్తు నుంచి పడటంతో తలకి తీవ్రగాయం అయి, బాగా రక్త స్రావం జరిగింది.

బిగ్ బాస్ సిబ్బంది వెంటనే తేరుకొని అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే దురదృష్టవశాత్తు గుణశేఖరన్ చనిపోయినట్లు వైద్యలు తెలిపారు. చనిపోయిన గుణశేఖరన్ గత కొంతకాలంగా ‘బిస్ బాస్’ సెట్ లో AC మెకానిక్ గా పని చేస్తున్నాడు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
బిగ్ బాస్ 2 షో ‘లోకనాయకుడు కమల్ హాసన్’ వ్యాఖ్యాతగా ఉన్నారు.

కాగా గుణశేఖరన్ కుటుంబాన్ని బిగ్ బాస్ షో నిర్వాహకులే కాకుండా, కమల్ హాసన్ కూడా అందుకోని, అతని కుటుంబానికి అండగా నిలబడాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

  • 8
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook