థియేటర్స్ లో మళ్ళీ ‘హను మాన్’ విధ్వంసం.. ఇప్పుడు 3డిలో రిలీజ్ వచ్చేసింది!

థియేటర్స్ లో మళ్ళీ ‘హను మాన్’ విధ్వంసం.. ఇప్పుడు 3డిలో రిలీజ్ వచ్చేసింది!

Published on May 16, 2026 1:54 PM IST

మొత్తం ఇండియన్ సినిమా దగ్గర రేర్ గా టచ్ చేసిన సూపర్ హీరో జానర్ లో హిట్స్ చాలా తక్కువ. అలాంటి సూపర్ జానర్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో చిత్రం ‘హను మాన్’ కొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. పాన్ ఇండియా లెవెల్లో ఊహించని బ్లాక బస్టర్ గా నిలిచి తెలుగు సినిమా నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమానే ఒక బ్లాస్ట్ గా నిలిచింది.

అలా గత 2024 సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా 350 కోట్లకి పైగా గ్రాస్ ని నమోదు చేయడమే కాకుండా ఈరోజుల్లో కూడా భారీ లాంగ్ రన్ ని అందుకొని సంచలనం సెట్ చేసింది. మరి అలాంటి ఈ సినిమా మళ్ళీ థియేటర్స్ లో విధ్వంసం చేసేందుకు రాబోతుంది. అయితే ఇది మామూలు రిలీజ్ కాదు ఈసారి హను మాన్ 3డి వెర్షన్ లో ఈ జూన్ 25న గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఖరారు చేశారు.

తెలుగు సహా హిందీ రెండు భాషల్లో ప్రస్తుతానికి మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఇది మాత్రం హను మాన్ సినిమా లవర్స్ కి ఒకింత బిగ్ అండ్ సర్ప్రైజింగ్ అప్డేట్ అనే చెప్పొచ్చు. మరి ఈసారి రీరిలీజ్ లో ఎలాంటి రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా గౌర హరి సంగీతం అందించారు. అలాగే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు