‘కాజల్’ పక్కన ఏ హీరో చెయ్యనన్నాడట !

Published on May 16, 2019 4:50 pm IST

ఇండస్ట్రీలో ఉన్నా టాప్ హీరోస్ అందరితో ఆడిపాడింది కాజల్ అగర్వాల్. కానీ విడుదలకు రెడీ అవుతోన్న ఓ సినిమాలో మాత్రం కాజల్ ఉంటే మేం యాక్ట్ చెయ్యమని కొంతమంది హీరోలు చెప్పారట. ఈ విషయాన్ని ఏ మాత్రం దాచుకోకుండా వ్యక్తపరిచాడు దర్శకుడు తేజ్. అసలు విషయంలోకి వెళ్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో ‘సీత’ సినిమా మే 24న రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా తేజ ‘సీత’ గురించి మాట్లాడుతూ.. ‘ఈ కథ కాజల్ అగర్వాల్ కు కొన్ని సంవత్సరాల క్రితమే తెలుసు. తను అప్పటి నుంచీ ఈ కథ నాతోనే చెయ్యాలి అని అడుగుతుండేది. ఇక కథను సినిమాగా తీద్దామనుకున్నాక కాజల్ ఇంట్రస్ట్ ను చూసి కాజల్ నే హీరోయిన్ గా ఫైనల్ చేశాను. ఆ తర్వాత హీరోగా యాక్ట్ చెయ్యడానికి చాలామంది హీరోలకు ఈ కథ చెప్పాను. వాళ్లకు కథ కూడా బాగా నచ్చింది. కానీ హీరోయిన్ గా కాజల్ యాక్ట్ చేస్తోంది అనే సరికి.. ఈ సినిమాలో నటించడానికి ఏ హీరో అంగీకరించలేదు. కథ మొత్తం కాజల్ చుట్టూనే తిరుగుతుంది.. అందుకే వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా యాక్ట్ చెయ్యడానికి ఒప్పుకున్నాడని తేజ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :

More