‘అన్‌ స్టాపబుల్’ షో సక్సెస్ వెనుక తేజస్విని !

Published on Jan 31, 2022 7:30 am IST

అల్లు అరవింద్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ దూసుకుపోతుంటారు. నిర్మాతగా కొత్త పుంతలు తొక్కుతూనే డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఓటీటీ మాధ్యమంలోకి ఎంట్రీ ఇచ్చి ‘ఆహా’తో ఓటీటీల్లోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా స్టార్ హీరోలతో కొత్త షోలను స్టార్ట్ చేసి తెలుగు ప్రేక్షకులకు ఆహాను మరింతగా చేరువ చేస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే కంటెంట్‌ విషయంలో ఆహా మొదటి నుంచి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎప్పటికప్పుడు భారీతనంతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటూనే ఉంది. ప్రస్తుతం నట సింహం బాలకృష్ణతో భారీ ఓటీటీ టాక్ షోను చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ‘అన్‌స్టాపబుల్’ షో సక్సెస్ వెనుక బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని నందమూరి కష్టం కూడా ఉందని ఈ షో రైటర్ బివిఎస్ రవి తెలిపారు.

కాగా షోలో బాలయ్యను కొత్తగా చూపేందుకు తేజస్విని చాలా రీసెర్చ్ చేశారని చెప్పారు. ‘అన్‌స్టాపబుల్’ టీమ్‌తో పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :