ఓటిటి రిలీజ్లపై నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆవేదపూరిత విన్నపం.!

Published on Jul 7, 2021 6:02 pm IST

ఏ ముహుర్తాన కరోనా ప్రపంచంలోకి ఎంటర్ అయ్యిందో కానీ దాని మూలాన ఇప్పటికీ తీవ్ర నష్టం వాటిల్లింది సినీ పరిశ్రమనే నమ్ముకున్న థియేటర్స్ యాజమాన్యం అనే చెప్పాలి. గత ఏడాది కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో థియేటర్స్ చాలా కాలం మూతబడిపోయాయి. దీనితో కొన్ని ఎన్నో థియేటర్స్ కూడా మూతపడిపోవడం సినీ ప్రేమికులకు మరింత బాధ కలిగించింది.

అయితే కరోనా ఒకటే అనుకుంటే ఇదే సమయంలో అనేక ఓటిటి సంస్థలు తమ మార్కెట్ ను విస్తరించడానికి పూనుకున్నాయి. షూటింగ్స్ పూర్తయ్యి థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అన్ని ఎన్నో సినిమాలు డైరెక్ట్ ఓటిటిలోనే రిలీజ్ కావడం ఎగ్జిబిటర్స్ కి మరో పెద్ద దెబ్బగా మారింది. దానితో అక్కడ నుంచి పూనుకున్న ఈ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ సంప్రదాయం పలు విభేదాలనే ఇండస్ట్రీలో తెచ్చిపెట్టింది.

ఓ పక్క కొంత నిర్మాతలు సినిమాలు నేరుగా ఓటిటికి ఇచ్చేస్తుంటే ఎగ్జిబిటర్లు అలా ఇవ్వవద్దని వేడుకుంటున్నారు. అలా ఇటీవలే అక్టోబర్ వరకు దయచేసి తెలుగు సినీ నిర్మాతలు తమ సినిమాలు ఏ ఓటిటికి అమ్మవద్దని విన్నవించుకున్నారు. మరి ఇప్పుడు “తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్” వారు మరోసారి తమ విన్నపాన్ని గట్టిగా ప్రెస్ మీట్ ద్వారా మరింతగా వివరించారు.

తాము ఏ ఓటిటికి కూడా వ్యతిరేఖం కాదని కానీ అలా అని ఎప్పటి నుంచో ఉన్న సినిమా థియేటర్స్ కాదని డైరెక్ట్ ఓటిటికే సినిమాలు ఇచ్చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. అలాగే ఓటిటి రిలీజ్ వల్ల ఉన్న కొన్ని లోపాలపై కూడా మాట్లాడుతూ ఇప్పుడున్న టెక్నాలజీతో ఓటిటి లో చూసేదానికన్నా మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో థియేటర్లు రెడీగా ఉన్నాయని అంత చిన్న స్క్రీన్స్ లో సరిగ్గా ఉందని సౌండ్స్ తో చూస్తే అసలు సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు.

అంతే కాకుండా ఈ మధ్యనే వచ్చిన సల్మాన్ రాధే బెటర్ గా అనిపించకపోవడానికి కూడా కారణం అదే అని గుర్తు చేశారు. ఒకవేళ అదే సినిమా థియేటర్లులో విడుదల చేసి ఉంటే ఫలితం ఇంకా మెరుగ్గా ఉండేది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా మరిన్ని కామెంట్స్ జత చేస్తూ ఒకవేళ ఓటిటికి ఇద్దాం అనుకున్నా థియేటర్లులో వచ్చాక ఒక పది పదిహేను వారాల తర్వాత ఇచ్చేలా ఒప్పందం చేసుకోవాలని సూచించారు.

ఇంకా కొందరు పెద్ద నిర్మాతలే ఓటిటికి సినిమాలు ఇస్తుండడం ఏమీ బాలేదని తమ ఆవేదనను వ్యక్తపరిచారు. దీనితో మొత్తంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఛాంబర్ సభ్యులు అంతా దయచేసి నిర్మాతలు మొదటి ఛాయిస్ గా ఓటిటిని ఎంచుకోవద్దని అక్టోబర్ వరకు ఆగాలని వారికి తమ గొంతును వినిపించారు.

సంబంధిత సమాచారం :