‘మహర్షి’ టికెట్స్ ధర పెంపు పై సీరియస్ !

Published on May 8, 2019 4:09 pm IST

‘మహర్షి’ సినిమా పై సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల కూడా విపరీతమైన ఆసక్తిని కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేస్తోన్నా.. టికెట్లు మాత్రం దొరకడం లేదు. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమాకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో 5 షోలు వేసుకోవటానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే థియేటర్స్ యాజమాన్యం టికెట్ ధరలను కూడా పెంచింది. కాగా ఈ టికెట్ ధర పెంపు పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. దీని పై తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మహర్షి టికెట్స్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, దీని పై లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్టు ఆయన తెలిపారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More