చిత్ర పరిశ్రమకు మద్దతుగా తెలంగాణ గవర్నమెంట్..!

చిత్ర పరిశ్రమకు మద్దతుగా తెలంగాణ గవర్నమెంట్..!

Published on May 3, 2020 11:11 PM IST

talasani
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగావున్న అనేక పరిశ్రమలు భారీ కుదుపుకు లోనయ్యాయి. వాటిలో చిత్ర పరిశ్రమ ఒకటి. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలతో పాటు టాలీవుడ్ కూడా మూసివేయడం జరిగింది. దీనివలన సినిమాల చిత్రీకరణ మరియు కొత్త సినిమాల విడుదల ఆగిపోయింది. దేనితో ఈ పరిసరమపై ఆధారపడిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అలాగే నిర్మాతలు భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు షూటింగ్స్ మరియు కొత్త సినిమాల విడుదల జరిగే అవకాశం లేదు.

అలాగే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని మే 3 నుండి 17కి పొడిగించడం జరిగింది.దీనితో తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ గారు ఈనెల 5న ఉదయం 10:30 నిమిషాలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ నందు పాత్రికేయులతో మాట్లాడనున్నారు. ప్రస్తుత ఇబ్బంది కర పరిస్థితులలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు పరిష్కార మార్గాలు వంటి అనేక విషయాలు అయన చర్చించనున్నారు.

తాజా వార్తలు