‘భీమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా తెలంగాణ మినిస్టర్

‘భీమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా తెలంగాణ మినిస్టర్

Published on Mar 2, 2024 4:03 PM IST

bhimaa 4 1

యాక్షన్ హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ భీమా. యువ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో అందరినీ ఎంతో ఆకట్టుకున్న భీమా మూవీ మహాశివరాత్రి కానుకగా మార్చి 8న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు సాయంత్రం 5 గం. ల నుండి హన్మకొండలోని కాకతీయ గవర్నమెంట్ కాలేజీలో వేడుకగా జరుగనుంది. మ్యాటర్ ఏమిటంటే, ఈ ఈవెంట్ కి చీఫ్ టెస్ట్ గా తెలంగాణ పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు విచ్చేయనున్నట్లు భీమా మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు