
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు నిన్న మాట్లాడుతూ రేపు ఓ బిగ్ న్యూస్ చెబుతాను అన్నారు. అయితే కె.టి.ఆర్ చెప్పే బిగ్ న్యూస్ ఏమై ఉంటుందా అని చాలామంది నిన్నటి నుంచి ఆసక్తిగా ఎదురు చూసారు. మరికొంత మంది ఒక అడుగు ముందుకేసి సరదాగా ’బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెబుతారా? అని ప్రశ్నించారు. దీనికి ఆశ్చర్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా మంత్రి కె. తారక రామారావు సమాధానంగా కొద్దిసేపటి క్రితం ’బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియదు. సమాధానం కావాలంటే నా ఫ్రెండ్ రానా దగ్గుబాటిని అడగండి’ అంటూ కె.టి.ఆర్ ట్విట్టర్ లో సరదాగా స్పందించారు. సినిమా విడుదలై సంవత్సరం దగ్గర కావొస్తున్నా బాహుబలి సినిమా నిత్యం ఏదో విధంగా వార్తల్లో ఉండటం గమనార్హం.
ఇంతకీ కెటిఆర్ చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే… యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఈరోజు హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఉన్న వేవ్ రాక్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన ఆపిల్ కార్యాలయంలోని డిజిటల్ మాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ విషయం గురించే నిన్న కెటిఆర్ చెప్పాలనుకున్న బిగ్ న్యూస్ అని ఈ రోజు అర్థమైంది.
For those of you asking if the big news was answer to 'why kattappa killed bahubali'?! I don't know!
Check with my friend ?@RanaDaggubati
— KTR (@KTRTRS) May 19, 2016