పవన్ మూవీలో ఐటెం సాంగ్ కొరకు తెలుగు బ్యూటీ

Published on Apr 4, 2020 8:07 am IST

తెలుగు బ్యూటీ పూజిత పొన్నాడకు భారీ ఆఫర్ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న భారీ పీరియడ్ డ్రామాలో స్పెషల్ సాంగ్ కొరకు ఆమెను తీసుకున్నారట. ఓ భారీ సెట్ లో ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. పూజిత గతంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో ఓ రోల్ చేశారు. అలాగే రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం మూవీలో ఆది పినిశెట్టి లవర్ పాత్ర కూడా ఆమె చేయడం జరిగింది. పవన్ లాంటి స్టార్ హీరో పక్కన సాంగ్ చేసే అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ కెరీర్ కి ఇది కలిసొచ్చే అంశమే.

ఇక ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో ఉండగా మొఘలుల కాలం నాటి పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహాలో సాగే బందిపోటు పాత్ర చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ పడింది.

సంబంధిత సమాచారం :

X
More