రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘డాన్ బాస్కో’. ఈ చిత్రంతో రుష్య దత్త హీరోగా పరిచయమవుతున్నారు. శంకర్ గౌరి రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో రుష్య దత్త ఒక చేతిలో కత్తి పట్టుకుని, స్టైలిష్‌గా కాలర్ ఎగరేస్తూ కనిపిస్తున్నారు. “ప్రతి రీయూనియన్ జ్ఞాపకాల కోసమే కాదు.. కొన్ని విముక్తి కోసం కూడా ఉంటాయి” అనే క్యాప్షన్ సినిమా కథాంశంపై ఆసక్తిని పెంచుతోంది.
‘జైలర్’, ‘నా సామి రంగ’ చిత్రాల ఫేమ్ మిర్నా మీనన్ ఇందులో లెక్చరర్ సుమతి పాత్రలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు మురళీ శర్మ ప్రిన్సిపాల్ విశ్వనాథ్‌గా కీలక పాత్ర పోషిస్తుండగా.. మౌనిక, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, విష్ణు ఓయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎంటర్‌టైనర్‌కు ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.


