2025 రీక్యాప్‌ : చిన్న సినిమాలతో పెద్ద ప్రభావం చూపిన కొత్త దర్శకులు

2025 రీక్యాప్‌ : చిన్న సినిమాలతో పెద్ద ప్రభావం చూపిన కొత్త దర్శకులు

Published on Jan 6, 2026 9:10 AM IST

2025 Rewind

2025 సంవత్సరం టాలీవుడ్‌కు పూర్తి సంతృప్తికరంగా లేకపోయినా, భారీ చిత్రాలు ఆశించిన స్థాయిలో నిలవకపోయినా, కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాల ద్వారా పలువురు కొత్త దర్శకులు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కావడం పెద్ద ప్లస్‌గా మారింది. కొత్త ఆలోచనలు, తాజా కథనాలతో వచ్చిన ఈ డెబ్యూ డైరెక్టర్లు టాలీవుడ్‌కు కొత్త ఆశను అందించారు.

సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్) :

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడు సాయి మార్తాండ్. మౌళి తనుజ్ ప్రశాంత్, శివాని నగరం హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏకంగా సంవత్సరపు అతిపెద్ద సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం.

రామ్ జగదీష్ (కోర్ట్) :

న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ‘కోర్ట్’ సినిమాతో రామ్ జగదీష్ అద్భుతమైన డైరెక్టోరియల్ డెబ్యూ ఇచ్చాడు. పోక్సో చట్టం లాంటి సున్నితమైన అంశాన్ని సమర్థంగా తెరకెక్కించిన తీరు విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా విజయం తెచ్చిపెట్టింది.

సాయిలు కంపాటి (రాజు వెడ్స్ రాంబాయి) :

తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ ద్వారా సాయిలు కంపాటి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా, దాని బలమైన క్లైమాక్స్‌తో ప్రేక్షకులను కుదిపేసింది.

మురళీకాంత్ దేవసోత్ (దండోరా) :

కుల వివక్ష అంశాన్ని కొత్త కోణంలో చూపించిన ‘దండోరా’ దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ కూడా కథన పరంగా తన సత్తా చాటుకున్నాడు. వాణిజ్యంగా పెద్ద విజయం సాధించకపోయినా, అతడి టాలెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

రాహుల్ శ్రీనివాస్ (ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో) :

‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’తో రాహుల్ శ్రీనివాస్ సరళమైన కథ, సహజమైన హాస్యంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.

యగంధర్ ముని (శంబాల) :

ఇక 2025 చివర్లో వచ్చిన ఆది సాయికుమార్ ‘శంబాల’ చిత్రంతో యుగంధర్ ముని తన తొలి ప్రయత్నంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. మిస్టికల్, హారర్ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం టాలీవుడ్‌కు 2025కి మంచి ముగింపునిచ్చింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు