కరోనా టైంలో తెలుగు నిర్మాతల మండలి కీలక నిర్ణయం

Published on Apr 20, 2021 6:08 pm IST

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు వేలకు చేరుకుంటున్నాయి. రికవరీ రేట్ బాగానే ఉన్నా వైరస్ బారినపడుతున్నవారు కూడ ఎక్కువగానే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ అయితే మరోసారి ఇబ్బందులను ఎదుర్కొనేలానే ఉంది. మొదటి లాక్ డౌన్ దెబ్బకే విలవిల్లాడిపోయారు సినీ కార్మికులు. హీరోలు సినిమాలు లేక ఖాళీగా ఉండిపోయారు. నిర్మాతలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ లాక్ డౌన్ అంటే కష్టాలు తప్పవు. పరిస్థితి చేయి దాటకముందే మొదలైన సినిమాలను ముగించి తీరాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ పరిమిత బృందంతో చిత్రీకరణలు, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకటనలో తెలిపింది. అత్యవసరం అనుకుంటే 50 మంది కార్మికులతోనే షూటింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ‘రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్’లతో పాటు ఇంకొన్ని చిత్రాలు తక్కువమందితోనే షూటింగ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :