ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, నిహారిక.ఎన్.ఎమ్ తదితరులు నటించిన సినిమా ‘మిత్రమండలి’. బన్నీ వాస్ సమర్పించారు. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడంలో విఫలమైన ఈ తెలుగు కామెడీ చిత్రం, అటు ఓటీటీలో కూడా తన అదృష్టాన్ని మార్చుకోలేకపోయింది. అక్కడ కూడా ఆకట్టుకోలేకపోయింది.
ఐతే, ఇప్పుడు చిత్ర నిర్మాతలు టెలివిజన్ ప్రేక్షకులను అయినా తమ చిత్రం ఆకట్టుకుంటుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్‌ను జీ తెలుగులో ఖరారు చేసుకుంది. ఈ సినిమా డిసెంబర్ 28, 2025 ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ఈ సినిమా ప్రసారం కానుంది. ఈ కామెడీ డ్రామాలో.. కొన్ని ఫన్ మూమెంట్స్ అండ్ నటీనటుల పనితీరు, వారి పాత్రల చిత్రీకరణ బాగున్నా.. సినిమాలో ఇంట్రెస్టింగ్ డ్రామా మిస్ కావడంతో సినిమా ప్లాప్ అయింది.


