‘వాల్మీకి’ ఐటమ్ పాటలో తెలుగమ్మాయి

Published on Jul 25, 2019 11:43 pm IST

మెగా హీరో వరుణ్ తేజ్ చేస్తున్న ‘వాల్మీకి’ చిత్రాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ అన్ని హంగులతో మాస్ ఎంటెర్టైనర్ తరహాలో రూపొందిస్తున్నాడు. మాస్ ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలు సినిమాలో ఉండేలా చూసుకుంటున్నాడు. వాటిలో ప్రధానంగా ఐటమ్ సాంగ్ కూడా ఒకటి. ఈ పాట ప్రత్యేకంగా ఉండాలని అందులో తెలుగమ్మాయిని తీసుకున్నారట.

ఆమే డింపుల్ హయాతి. ‘గల్ఫ్’ సినిమాతో నటిగా పరిచయమైన ఈ హైదరాబాదీ అమ్మాయి ఇటీవల ప్రభుదేవ, తమన్నాలు నటించిన ‘దేవి-2’లో కూడా నటించింది. ఈ చిత్రంలో ఆత్రవ మురళి, పూజా హెగ్డేలు కీలక పాత్రలు చేస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :