మనం ఎవరికీ తక్కువ కాదు : హీరో ‘సుధీర్ బాబు’

15th, March 2016 - 10:37:44 AM

sudheerbabu1
‘ఎస్ఎంఎస్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో ‘సుధీర్ బాబు’ బాలీవుడ్ లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు ‘షబ్బీర్ ఖాన్’ తెరకెక్కించిన ‘బాగి’ సినిమాలో సుధీర్ బాబు నటించారు. ‘టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్’ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సుధీర్ బాబు ఓ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు. పూర్తి యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ ట్రైలర్ కు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది.

ఈ ట్రైలర్ గురించి సుధీర్ బాబు తన ట్విట్టర్ లో ‘ఈ ట్రైలర్ అప్ లోడ్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చాయి’ అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ‘ఎక్కడో బాలీవుడ్ లో ఒక్క చాలెంజింగ్ రోల్ కోసం వెతుక్కుంటూ ఒక తెలుగోడిని తీసుకుపోయారు.. మనం ఎవరికీ తక్కువ కాదు’ అంటూ తన బాలీవుడ్ ఎంట్రీపై తనకున్న నమ్మకాన్ని తెలిపారు. ఇక బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబుకు పలువురు సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.