ఓటిటి లోకి వచ్చిన శివ రాజ్‌కుమార్ “ఘోస్ట్” తెలుగు వెర్షన్

ఓటిటి లోకి వచ్చిన శివ రాజ్‌కుమార్ “ఘోస్ట్” తెలుగు వెర్షన్

Published on Dec 1, 2023 1:03 PM IST

కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్ నటించిన, ఘోస్ట్ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. కన్నడ లో సూపర్ సక్సెస్ అయిన ఈ మూవీ తెలుగు లో అంతగా ఆకట్టుకోలేదు. MG శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా జీ 5లో ప్రసారం అవుతోంది. ఇప్పుడు, తెలుగు డబ్బింగ్ ఎడిషన్ అదే ప్లాట్‌ఫారమ్‌ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.

ఇతర ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుందనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. జయరామ్, అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణన్, అర్చన జోయిస్, సత్య ప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సందేశ్ ప్రొడక్షన్స్ పై నిర్మించిన ఈ సినిమాకి అర్జున్ జన్య సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు