‘టెంపర్’ తమిళ వర్షన్ గురించి లేటెస్ట్ అప్ డేట్స్ !
Published on Sep 10, 2018 5:16 pm IST


ఎన్టీఆర్- పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. వరుసగా ప్లాప్ లతో సతమవుతున్న ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం టెంపర్ కావడం విశేషం. అయితే ఈ చిత్రం రీమేక్ రూపంలో తమిళ్ లోకి కూడా వెళ్ళబోతుందని తెలిసిన విషయమే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో విశాల్ మరియు రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ లోని విశాల్ మరియు రాశి ఖన్నాల మధ్య సాగే కొన్ని ప్రేమ సన్నివేశాలను షూట్ చేశారు.

కాగా, త్వరలో ఈ చిత్రానికి సంబంధించి ఓ బీచ్ సాంగ్ ని కూడా చిత్రీకరించనున్నారట. ఎ.ఆర్ మురుగదాస్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘అయోగ్య’ అనే పేరుతో ఈ చిత్రం రాబోతుంది. మరి ఎన్టీఆర్ కి హిట్ ఇచ్చిన పోలీస్ స్టోరీ, విశాల్ కి కూడా హిట్ ఇస్తుందేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook