ఆడియో సమీక్ష : టెంపర్ – అనూప్ రూబెన్స్ కమర్షియల్ ఆల్బమ్.!

Published on Jan 29, 2015 3:30 pm IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన పవర్ఫుల్ పోలీస్ ఎంటర్టైనర్ ‘టెంపర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో ఆల్బమ్ ని నిన్న సాయంత్రం హైదరాబాద్ లో రిలీజ్ చేసారు. ఈ ఆల్బంలో మొత్తం 5 పాటలున్నాయి. మరి మొదరి సారి అనూప్ రూబెన్స్ ఎన్.టి.ఆర్ కి ఏ రేంజ్ మ్యూజిక్ అందించాడు, ఈ ఐదు సాంగ్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం..

1. పాట : చూలేంగే ఆస్ మా

గాయనీ గాయకులు : అద్నాన్ సమీ, రమ్య బెహరా, వీణ ఘంటశాల

సాహిత్యం : విశ్వ

టెంపర్ ఆల్బంలో మొదటగా వచ్చే ‘చూలేంగే ఆస్ మా’ ఒక డ్యూయెట్ సాంగ్. ఈ సాంగ్ ఈ ఆల్బంలోనే బెస్ట్ సాంగ్ అవుతుందని చెప్పవచ్చు. ఫేమస్ సింగర్ అద్నాన్ సమీ అందించిన వాయిస్ ఈ పాటకి ప్రాణం పోసిందని చెప్పాలి. ఈ సాంగ్ వినడానికి కూడా చాలా వినసొంపుగా ఉంది, అలాగే మధ్య మధ్యలో వచ్చే హిందీ పదాలు పాటకి మంచి ఫీల్ ని ఇచ్చాయి. అనూప్ రూబెన్స్ కూడా ఈ పాటని అర్బన్ స్టైల్ లో ఫీల్ గుడ్ అనిపించేలా మ్యూజిక్ కంపోజ్ చేసాడు. విశ్వ రాసిన సాహిత్యం కూడా బాగుంది. మీరు మొదటిసారి విన్నప్పుడే ఈ సాంగ్ మీకు బాగా నచ్చేస్తుంది. ఆన్ స్క్రీన్ చాలా స్టైలిష్ గా ఉండేలా ఈ పాటని పూరి షూట్ చేసారు.

2. పాట : టెంపర్

గాయనీ గాయకులు : ఉమా నేహ, ఎం.ఎల్.ఆర్ కార్తికేయన్, భార్గవి పిళ్ళై, సింహా

సాహిత్యం : భాస్కర భట్ల

ఈ ఆల్బంలో వచ్చే సెకండ్ సాంగ్ టెంపర్ అనే టైటిల్ సాంగ్. ఈ పాట కూడా వినేటప్పుడు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. చెప్పాలంటే ఈ పాట మాస్ ఆడియన్స్ కి తెగ నచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ పాటలో నందమూరి ఫ్యామిలీ హీరోస్ గురించి వచ్చే లైన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. భాస్కర భట్ల కూడా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే ఈ లిరిక్స్ రాసినట్టున్నాడు. సింగర్స్ ఉమా నేహ, ఎం.ఎల్.ఆర్ కార్తికేయన్, భార్గవి పిళ్ళై, సింహాలు కలిసి ఎంతో జోష్ ఫుల్ గా ఈ పాటని పాడారు. అనూప్ కూడా మాస్ సాంగ్ కి తగ్గరీతిలోనే మ్యూజిక్ అందించాడు.

3. పాట : దేవుడా

గాయకులు : అనూప్ రూబెన్స్, పూరి జగన్నాధ్

సాహిత్యం : భాస్కర భట్ల

ఆల్బంలోని మూడవ సాంగ్ దేవుడా అంటూ మొదలవుతుంది. హీరో తన క్యారెక్టర్ పై తనే సెటైర్స్ వేసుకుంటూ, తప్పు జరిగిపోయిందని మరో ఛాన్స్ ఇమ్మని దేవుడిని కోరే పాట. ఈ పాట కూడా వినగానే బాగా నచ్చేస్తుంది. వినగా వినగా ఈ సాంగ్ కి చాలా మంది అడిక్ట్ అవుతారు. ఈ పాటని అనూప్ రూబెన్స్, పూరి జగన్నాధ్ కలిసి పాడారు. అనూప్ వాయిస్ కి మధ్య మధ్యలో పూరి వాయిస్ తోడవడంతో వినడానికి చాలా బాగుంటుంది. భాస్కర భట్ల రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. ఈ పాటకి అనూప్ రూబెన్స్ వాడిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.

4. పాట : వన్ మోర్ టైమ్

గాయనీ గాయకులు : రంజిత్, లిప్సిక

సాహిత్యం : కందికొండ

టెంపర్ ఆల్బంలో వచ్చే మరో డ్యూయెట్ మరియు లవ్ సాంగ్ ‘వన్ మోర్ టైం’. ఈ రొమాంటిక్ సాంగ్ లో ఎక్కువగా హీరోయిన్ హీరోపై ఆసక్తి చూపుతూ పాడేపాటలా అనిపిస్తోంది. చాలా స్లోగా మెలోడియస్ గా సాగే ఈ రొమాంటిక్ సాంగ్ కి కందికొండ మంచి ఫీలున్న సాహిత్యం అందించాడు. లిరిక్స్ లో ఆయన వాడిన ఆన్ ది స్పాట్ అనే పదానికి వినేవారు బాగా కనెక్ట్ అవుతారు. పాటకి తగ్గట్టుగానే అనూప్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సాంగ్ విజువల్ గా చూసినప్పుడు ఇంకా బాగా నచ్చే అవకాశం ఉంది.

5. పాట : ఇట్టాగే రెచ్చిపోదాం

గాయకులు : గీతా మాధురి (ధనుంజయ్, అనుదీప్, అరుణ్)

సాహిత్యం : భాస్కర భట్ల
టెంపర్ ఆల్బంలో వచ్చే చివరి సాంగ్ ‘ఇట్టాగే సాగిపోదాం’ అని మొదలయ్యే ఐటెం సాంగ్. ఫుల్ బీట్స్ తో లిరిక్స్ లో మాస్ లైన్స్ తో సాగే ఈ పాట కేవలం ముందు బెంచ్ వారిని మాత్రమే టార్గెట్ చేసినట్టు ఉంటుంది. అనూప్ ఈ పాటకి మన నేటివిటీకి తగ్గట్టుగా ఉండేలా బీట్స్ అని కంపోజ్ చేసాడు. అలాగే గీత మాధురి వాయిస్ ఈ పాటకి మరో పెద్ద ప్లస్ అయ్యింది. భాస్కర భట్ల కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చేలా ఈ పాటని రాసాడు.

తీర్పు :

ఇప్పటివరకూ ఎక్కువగా రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ కి మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ ఎన్.టి.ఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాతో ఓ బిగ్ హీరో కమర్షియల్ ఎంటర్టైనర్ కి కూడా మ్యూజిక్ అందించగలడని నిరూపించుకున్నాడు. పూరి జగన్నాధ్ తక్కువ టైంలో మంచి సాంగ్స్ ని అనూప్ నుంచి తీసుకున్నాడనే చెప్పాలి. మా పరంగా చూలేంగే ఆసుమా, దేవుడా మరియు టెంపర్ సాంగ్స్ ది బెస్ట్ అని చెప్పాలి. ఈ మూడు అందరికీ వినగానే నచ్చేసేలా ఉన్నాయి. చివరిగా టెంపర్ సినిమా ఆడియో అన్ని రకాల సాంగ్స్ మిక్స్ చేసిన ఆల్బం.

ఆడియో సాంగ్స్ వినడం కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More