
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన టెంపర్ చిత్రం ఈ నెల 13న భారీ విడుదలకు సిద్ధపడుతుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే సోమవారం సెన్సార్ జరుపుకోనుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్నాడు. ఈ సినిమా విజయం పై నమ్మకంగా వున్నాడు.
వక్కంతం వంశీ కధని అందించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. బండ్ల గణేష్ నిర్మాత.

