‘టెంప్ట్ ర‌వి’ ఈ సారి ‘వైఫ్‌’తో…!

Published on Jul 11, 2019 3:04 pm IST

ఇటీవ‌ల యూట్యూబ్ లో టీజ‌ర్ తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఏడుచేప‌ల క‌థ సినిమాలో టెంప్ట్ రవిగా దూసుకుపోయిన అభిషెక్ రెడ్డి హీరోగా, సాక్షి నిదియా హీరోయిన్ గా.. జి.చ‌రితా రెడ్డి నిర్మాతగా జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుడిగా నిర్మిస్తున్న చిత్రానికి “వైఫ్,ఐ” అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి నైఫ్ బెట‌ర్ దెన్ వైఫ్ అనే క్యాప్ష‌న్ ని పెట్టారు.. ఈ చిత్రం యెక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు జి.ఎస్‌.ఎస్‌.పి క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. గ‌తంలో నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అంతం చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా చాలా మంచి విజ‌యాన్ని సాధించింది. త‌రువాత మంచి క‌థ కొస‌మే ఇన్ని రోజులు ఆగాల్సి వ‌చ్చింది. ఇప్ప‌డు స‌మాజంలో జ‌రుగుతున్న ఒక మంచి పాయింట్ ని చాలా ఎంట‌ర్‌ టైనింగ్ గా తెర‌కెక్కించాము. ఏడు చేప‌ల క‌థ చిత్రంతో చాలా ఫేమ‌స్ అయిన నేచుర‌ల్ ఆర్టిస్ట్ అభిషేక్ రెడ్డి హీరోగా సాక్షి నిదియా జంట‌గా న‌టించారు. ఈ చిత్రం లో భార్య‌, భర్త మధ్య వుండే అన్ని ర‌సాలు క‌ల‌గలుపుగా వుంటాయి.. పూర్తి రొమాంటిక్ కామెడీ గా తెర‌కెక్కిస్తున్నాము అని అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More