“ఆదిపురుష్” కొత్త రిలీజ్ విషయంలో టెన్స్ వాతావరణం!

“ఆదిపురుష్” కొత్త రిలీజ్ విషయంలో టెన్స్ వాతావరణం!

Published on Nov 8, 2022 3:06 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా టాకీ పార్ట్ అయితే ఆల్రెడీ సినిమాపై కంప్లీట్ అయ్యిపోయింది. కానీ గ్రాఫిక్స్ మాత్రం ఇంకా ఆకట్టుకునే రేంజ్ లో రాలేకపోయే సరికి అనుకున్నట్టు గానే మేకర్స్ సినిమా వాయిదా కన్ఫర్మ్ చేసి జూన్ లో ఫిక్స్ చేశారు.

అయితే ఈ జూన్ కొత్త రిలీజ్ విషయంలో కాస్త టెన్స్ వాతావరణం ఇప్పుడే స్టార్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా 3డి వెర్షన్ లో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా అయితే ఎక్కువ 3డి రిలీజ్ నే ఎక్కువ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.

మరి ఈ రిలీజ్ కి దెబ్బ పడేలా ఉందని అయితే టాక్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఇదే జూన్ లో ఎక్కువ హాలీవుడ్ సినిమా 3డి రిలీజ్ కి కూడా ఉన్నాయని దీనితో ఆదిపురుష్ కి ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ రిలీజ్ ఉంటుందా లేదా అనేది డౌట్ గా మారినట్టు ఇప్పుడు నుంచే టాక్ స్టార్ట్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు