బజ్..”ఆదికేశవ” ఓటిటిలో అప్పటికి?

బజ్..”ఆదికేశవ” ఓటిటిలో అప్పటికి?

Published on Nov 26, 2023 5:00 PM IST

మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన మాస్ యాక్షన్ డ్రామా “ఆదికేశవ”. మరి డీసెంట్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం కాస్త మిక్స్డ్ స్పందనను ఆడియెన్స్ నుంచి అందుకుంది. అలా ఇప్పుడు థియేటర్స్ రన్ అవుతున్న ఈ సినిమా నుంచి ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

దీనితో ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ రానున్న క్రిస్మస్ కానుకగా అయితే అందులో స్ట్రీమింగ్ వస్తుంది అని తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో జీజు జార్జ్, సుమన్, రాధికా మరియు సదా తదితరులు కీలక పాత్రల్లో నటించగా జివి ప్రకాష్ సంగీతం అందించాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు