ఓటిటి సమీక్ష: తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా – ప్రైమ్ వీడియోలో హిందీ చిత్రం

ఓటిటి సమీక్ష: తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా – ప్రైమ్ వీడియోలో హిందీ చిత్రం

Published on Mar 24, 2024 6:38 PM IST
Teri Baaton Mein Aisa Uljha Jiya Hindi Movie Review

విడుదల తేదీ : మార్చి 22, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: షాహిద్ కపూర్, కృతి సనన్, ధర్మేంద్ర, డింపుల్ కపాడియా, తదితరులు

దర్శకుడు: అమిత్ జోషి, ఆరాధనా సాహ్

నిర్మాత: దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే, లక్ష్మణ్ ఉటేకర్

సంగీత దర్శకులు: తనిష్క్ బాగ్చి, సచిన్ – జిగర్, మిత్రాజ్

సినిమాటోగ్రాఫర్‌: లక్ష్మణ్ ఉటేకర్

ఎడిటింగ్: మనీష్ ప్రధాన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

షాహిద్ కపూర్ మరియు కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్ మీద అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

ఆర్యన్ అగ్నిహోత్రి (షాహిద్ కపూర్) తన ఆంటీ ఊర్మిళ (డింపుల్ కపాడియా) కంపెనీలో రోబోటిక్స్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని అతని కుటుంబం కోరుకుంటుంది. కానీ ఆర్యన్ తన వివాహ ప్రణాళికలను వాయిదా వేస్తూనే ఉన్నాడు. తన ఆంటీ ఆహ్వానంపై, ఆర్యన్ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌లో పని చేయడానికి USA వెళతాడు. ఊర్మిళకి ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, ఎమర్జెన్సీ టాస్క్ కారణం గా మరొక నగరానికి వెళుతుంది. ఊర్మిళ తన మేనేజర్, సిఫ్రా (కృతి సనన్)తో ఆర్యన్ ను చూసుకోమని అడుగుతుంది. ఆర్యన్ మరియు సిఫ్రా ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితంగా ఉంటారు. సిఫ్రా పై ఆర్యన్ ఇష్టం పెంచుకుంటాడు. కానీ సిఫ్రా మనిషి కాదని, హ్యూమనాయిడ్ రోబో అని ఆర్యన్ తెలుసుకుంటాడు. తర్వాత ఆర్యన్ ఏం చేశాడు? అతను సిఫ్రాను మరచిపోయాడా? ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రం ఒక సింపుల్ స్టోరీ లైన్ ను కలిగి ఉంది. ఇందులో ఫన్ పార్ట్ చాలా బాగుంది. తమ వద్ద గొప్ప ప్లాట్లు లేవని మేకర్స్‌కు బాగా తెలుసు. సినిమాలో సిట్యువేషన్ కామెడీ అలరిస్తుంది. కృతి సనన్ ఒక మనిషి అని తన కుటుంబాన్ని నమ్మించేందుకు షాహిద్ కపూర్ చేసిన ప్రయత్నాలు బాగా ఆకట్టుకుంటాయి.

సినిమాలో సరదా సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మేకర్స్ బాగా హ్యాండిల్ చేశారు. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అలరిస్తుంది. కృతి సనన్ నటన అద్భుతం అని చెప్పాలి. డింపుల్ కపాడియా తన పాత్రలో చక్కగా నటించింది. సినిమా ఐడియా చాలా బాగుంది. ఇతర ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చిత్రాలతో పోల్చితే ఇది డిఫెరెంట్ అని చెప్పాలి.

షాహిద్ కపూర్ సినిమాలో అద్భుతంగా నటించాడు. కృతి సనన్ రోబో అని తెలుసుకున్న తర్వాత, నటుడు తన ఎమోషన్స్ ను, ఫ్రస్ట్రేషన్ ను చిత్రించిన విధానం అద్భుతం. షాహిద్ కపూర్ యొక్క కామెడీ టైమింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో అతని ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ అలరిస్తుంది. ఇటీవల కాలంలో, షాహిద్ కపూర్ ఇంటెన్స్ రోల్స్ లో కనిపించాడు. ఈ చిత్రం అతని ఫన్ యాంగిల్ ను ప్రదర్శిస్తుంది.

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కృతి సనన్ సిఫ్రాగా అద్భుతంగా నటించింది. తన పెర్ఫార్మెన్స్ తో, తన పాత్రకు కృతి సనన్ పూర్తి న్యాయం చేసింది. షాహిద్ కపూర్‌తో తన కెమిస్ట్రీ బాగుంది. ప్రధాన జంట యొక్క హాట్ కెమిస్ట్రీ ఈ చిత్రం కి ప్లస్ అని చెప్పాలి. పాటలు, విజువల్స్ ఆడియెన్స్ ను అలరిస్తాయి.

 

మైనస్ పాయింట్స్:

ఎమోషన్స్ విషయం లో ఇంకా బెటర్ గా చేయడానికి చాలా అవకాశం ఉంది. కొన్ని మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, కానీ అవి ఫన్ యాంగిల్ లో హైడ్ చేసినట్లు ఉంటుంది. అందువల్ల, ఈ సినిమా పూర్తి ఎంటర్టైనర్ కాదు అని చెప్పాలి.

సినిమా అక్కడక్కడా నెమ్మదిగా సాగుతుంది. ఎడిటింగ్ టీమ్ రెండు ఫ్యామిలీ సీక్వెన్స్‌ల నిడివిని తగ్గించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అవి సినిమాకి అంత ఇంపార్టెన్స్ గా ఉండవు. ధర్మేంద్ర పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఈ పాత్ర అంతగా ఆకట్టుకోదు. అతని మునుపటి చిత్రం (రాకీ ఔర్ రాణి)లో మంచి యాక్టింగ్, రోల్ తో గొప్ప ప్రభావాన్ని చూపింది. అయితే ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నిరాశపరిచింది అని చెప్పాలి.

 

సాంకేతిక విభాగం:

ఇలాంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లకి మంచి పాటలు కావాలి. ఈ చిత్రం లో పాటలు బాగున్నాయి. టైటిల్ ట్రాక్, అఖియాన్ గులాబ్ మరియు లాల్ పీలీ అఖియాన్ వినడానికి మరియు చూడటానికి బాగున్నాయి. లక్ష్మణ్ ఉటేకర్ విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలతో సినిమా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే.

దర్శకులు అమిత్ జోషి, ఆరాధనా సాహ్ సినిమాకి చక్కగా పనిచేశారు. చాలా సన్నివేశాలు ఆడియెన్స్ ను అలరిస్తాయి. అయితే ఎమోషనల్ మూమెంట్స్, డ్రామాకి సంబంధించి రైటింగ్ డిపార్ట్‌మెంట్ ఇంకా బెటర్ గా వర్క్ చేసి ఉంటే బాగుండేది.

 

తీర్పు:

మొత్తం మీద, తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా చిత్రం సరదాగ సన్నివేశాలతో సాగే టైమ్ పాస్ ఎంటర్టైనర్. ఎంటర్ టైన్మెంట్ ను ఆడియన్స్ కి అందించడం లో సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. షాహిద్ కపూర్ మరియు కృతి సనన్ వారి పాత్రలలో ఆకట్టుకున్నారు. వీరిద్దరి సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. అయితే ఎమోషనల్ డెప్త్ అంతగా లేదు. ఇది సినిమాను నెక్స్ట్ లెవెల్ కి వెళ్లనీయకుండా చేసింది అని చెప్పాలి. అలాగే ఒక్కోసారి సినిమా స్లోగా సాగుతుంది. మీరు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లను చూడటం ఇష్టపడే వారైతే, ఈ చిత్రం ఈ వారాంతం అలరిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు