“తగ్గేదే లే” అంటోన్న నవీన్‌ చంద్ర టీజర్..!

Published on Oct 15, 2021 2:06 am IST


నవీన్‌ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేతుగుప్త, రవిశంకర్‌, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో, శ్రీనివాస్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమా టీజర్‌ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

ఈ సినిమాలో నవీన్‌ చంద్ర పోలీసు అధికారిగా కనిపించబోతున్నాడు. ఎలాంటి డైలాగ్స్ కేవలం తన హావభావాలతోనే సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు అంతేకాదు తన పాత్రకి సంబంధించి రెండు కోణాల్ని ఆవిష్కరించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తుండగా, గ్యారీ బి.హెచ్‌ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :