‘ఖాకి’ దర్శకుడితో అజిత్ !

Published on Jul 21, 2018 11:29 am IST

తమిళ స్టార్ హీరో తల అజిత్ ప్రస్తుతం ‘విశ్వాసం’ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం యొక్క సగభాగం ను హైదరాబాద్ లో ని రామోజీ ఫిలిం సిటీలోనే తెరకెక్కించారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తుంది.

ఇక ఈ చిత్రం తరువాత అజిత్ యువ దర్శకుడు వినోత్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవల ఈ దర్శకుడు కార్తీ , రకుల్ ప్రీత్ జంటగా ‘తీరం అడిగారా ఒండ్రు’ అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని సాధించారు. నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ కథతో తెరకెక్కిన ఈచిత్రం తెలుగులో ‘ఖాకి’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది.

ఇక వినోత్ చెప్పిన కథ అజిత్ కు బాగా నచ్చడంతో వెంటనే ఆయనతో సినిమా చేయాడనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ‘విశ్వాసం’ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరింది ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత తల ఈ కొత్త చిత్రాన్ని మొదలు పెట్టనున్నారు.

సంబంధిత సమాచారం :