వైరల్ అవుతున్న థలా అజిత్ స్పెషల్ మెసేజ్.!

Published on Aug 6, 2021 8:00 am IST

మన దక్షిణాది సినిమా దగ్గర అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో కోలీవుడ్ హీరో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. తన సినిమాలతో ఇప్పటి వరకు భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న అజిత్ అంటే అందరికీ హీరోగా అనే కాకుండా వ్యక్తిగా కూడా ఇష్టపడే వారూ అధికంగానే ఉన్నారు. మరి అలాంటి వారికి తన అభిమానులకు అలాగే తనని ద్వేషించే వాళ్లకు మరియు తన పట్ల తటస్తంగా ఉండేవారికి కూడా తాను ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా చెప్పిన మెసేజ్ ఇపుడు వైరల్ అవుతుంది.

“తనని ఎంతగానో ప్రేమిస్తున్న అభిమానులు, అలాగే హేటర్స్ ఇంకా తటస్తంగా ఉండే ముగ్గురుని కూడా ఒక నాణేనికి మూడు వైపులులా అనుకుంటానని ముగ్గురూ ఇచ్చే ప్రతి దానిని కూడా ఒకేలా తీసుకుంటానని బ్రతుకుదాం.. మీ అందరి మీద కూడా నా కారణం లేని ప్రేమ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది” అని అజిత్ తెలిపారు. కోలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన ఈ స్పెషల్ మెసేజ్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది. మరి ప్రస్తుతం అజిత్ నటిస్తున్న భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “వలిమై” భారీ సిద్ధం అవుతూ వచ్చే దీపావళికి రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం :