రికార్డ్ అలర్ట్..వరల్డ్ రికార్డే సెట్ చేసిన అజిత్ “వలిమై” సినిమా.!

Published on Jul 8, 2021 4:00 pm IST

సౌత్ ఇండియన్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోత్ దర్శకత్వంలో వహిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “వలిమై” పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. పాన్ ఇండియన్ లెవెల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇంకా అప్డేట్ లేకుండానే భారీ హైప్ ను సెట్ చేసుకొని గత కొన్నాళ్ల నుంచి సౌత్ ఇండియన్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాకి కనీ వినీ ఎరుగని విధంగా బుక్ మై షో లో ఇంట్రెస్ట్స్ వస్తుండడం ఆ మధ్య సంచలనంగా మారింది. కనీసం ఫస్ట్ లుక్ పై అప్డేట్ కూడా లేకుండా ఏకంగా 1 మిలియన్ ఇంట్రెస్ట్ లు రిజిస్టర్ చేసుకుంది. అలా అప్పుడు బాహుబలి 2 కి రీచ్ కాగా ఇప్పుడు ఏకంగా వరల్డ్ రికార్డునే ఈ సినిమా నెలకొల్పింది.

వరల్డ్ హైయెస్ట్ గ్రాసర్ “అవెంజర్స్ ఎండ్ గేమ్” కి ఉన్న 1.7 మిలియన్ ఇంట్రెస్ట్ ల మార్క్ ను దాటేసి 1.73 మిలియన్ మార్క్ తో వరల్డ్ రికార్డునే సెట్ చేసింది. దీనిని బట్టి ఈ సినిమాపై ఎంత హైప్ ఉందో అజిత్ అభిమానులు ఏ లెవెల్లో ఎదురు చూస్తున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :