తలైవర్ స్టార్ట్ చేసేది అప్పటి నుంచే.!

Published on Nov 13, 2020 3:03 pm IST

తన సినిమాతో అన్ని భాషల్లోనూ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చెయ్యగలిగే వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ హీరో రజినీకాంత్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివ తో ఒక సాలిడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి “అన్నాత్తే” అనే పవర్ ఫుల్ టైటిల్ ను కూడా పెట్టడం అలాగే రజిని రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంటుందని తెలియడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

అయితే చాలా త్వరగా ఫినిష్ చేసేద్దాం అనుకున్న ఈ భారీ ప్రాజెక్ట్ కరోనా వల్ల పెద్ద బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. దానికి తోడు తలైవర్ కు ఆరోగ్యం పరంగా కూడా కొన్ని సమస్యలు లేవనెత్తడంతో షూటింగ్ మరోసారి వాయిదా పడింది. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుందో తెలుస్తుంది. దర్శకుడు శివకు రజిని ఈ చిత్రం షూట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసేందుకు అంగీకారం తెలిపారట. సో ఈ తలైవర్ అప్పుడు ల్యాండ్ అవ్వబోతున్నారనమాట.

సంబంధిత సమాచారం :