ఇండియాలో అడుగుపెట్టిన తలైవర్..ఇక ‘అన్నాత్తే’ షురూ.!

Published on Jul 9, 2021 9:00 am IST

ఇండియన్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం చాలా మేర షూటింగ్ ను కంప్లీట్ చేసిన రజినీ తన ఆరోగ్య పరిస్థితులు రీత్యా ఇటీవలే యునైటెడ్ స్టేట్స్ కి చికిత్స నిమిత్తం వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే అక్కడ అమెరికా వీధుల్లో ఆరోగ్యంగా కనిపించి అభిమానులకు ఆనందం కలిగించారు.

మరి ఇప్పుడు తలైవర్ ఫ్యాన్స్ కి ఆనందం కలిగించే న్యూ ఇంకొకటి వచ్చేసింది. రజినీ ఈరోజు ఉదయం రెండున్నర గంటల సమయంలో ఇండియాలో అమెరికా నుంచి చికిత్స అనంతరం అడుగు పెట్టినట్టు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో మళ్ళీ రజినీ అభిమానుల్లో ఆనందం నెలకొంది. సో ఇంకా ఎలాగో మళ్ళీ రజినీ అన్నాత్తే షూట్ ని రీస్టార్ట్ చేసేయడం ఖాయం అని చెప్పాలి. ప్రస్తుతం రజినీ రీఎంట్రీ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :