తలైవి గా కంగనా ని చూశారా..?

Published on Nov 23, 2019 9:00 pm IST

వెండితెరపై ఒక వెలుగు వెలిగిన జయలలిత రాజకీయాలలో ఒక సంచలనం. అవమానాలు, వివాదాలు,పదవులు ఇలా ఒక సినిమాకు మించిన నాటకీయత ఆమె జీవితంలో ఉంది. ఆమె మరణం తరువాత జయలలిత జీవితంపై అనేకమంది బయో పిక్స్ తీస్తున్నారు. అలా తెరకెక్కుతున్న చిత్రాలలో తలైవి ఒకటి. మిగతా చిత్రాలకు మించిన క్రేజ్ ఈ మూవీ సొంతం. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు నిర్మించడంతో పాటు, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ మూవీలో నటించడం ఒక కారణం గా చెప్పవచ్చు.

ఇక ఇటీవలే తలైవి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాగా నేడు తలైవి జయలలితగా కంగనా లుక్ రివీల్ చేశారు.హాలీవుడ్ కి చెందిన మేకప్ నిపుణులు కంగనా ను జయలలిత గా చూపించే ప్రయత్నం చేశారు. కొంత వరకు కంగనా ఆ లుక్ కి సరిపోయారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు విజయ్ తెరకెక్కిస్తుండగా విష్ణు వర్ధన్ ఇందుకూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు. అరవింద స్వామి కీలకమైన కరుణానిధి పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :