తలైవి పై మరింత ఆసక్తి రేకెత్తిస్తున్న తాజా ఫొటోలు!

Published on Jul 2, 2021 12:23 am IST

విలక్షణ నటిగా పేరొందిన కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం తలైవి. ఈ చిత్రం తమిళ నటి, దివంగత మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలిత జీవితగాథ గా తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా లో అప్పటి నిజ జీవిత సంఘటనలను కళ్ళకి కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు ఎ. ఎల్. విజయ్. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం ను ఇప్పటికీ విడుదల చేయలేదు చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

అయితే ఫోటోలను గమనిస్తే అప్పటి తమిళనాడు మాజి ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్ ను మరియు అప్పటి ప్రధాన మంత్రి అయిన ఇందిరా గాంధీ ను కలిసినట్లు గా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా కి సంబందించిన స్టిల్స్ కంగనా నటనా ప్రతిభను వెలికి తీస్తున్నట్లు ఉండగా, తాజా చిత్రాలు సినిమా పై మరింత ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అయితే ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటించగా, ప్రకాష్ రాజ్, మధుబాల, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జీవి ప్రకాష అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :