విజయ్ 65వ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అక్కడే.!

Published on Apr 7, 2021 8:00 am IST

“మాస్టర్” తో ఇళయ థలపతి విజయ్ మరో బంపర్ హిట్ కు తన ఖాతాలో వేసుకున్నాడు. దీనితో మన తెలుగులో కూడా మార్కెట్ ను బాగా పెంచుకున్నాడు. మరి అలాగే ఈ చిత్రం అనంతరం విజయ్ చేయబోయే తన 65వ ప్రాజెక్ట్ కు సంబంధించి భారీ అంచనాలు కూడా నెలకొన్న సంగతి తెలిసిందే.

అక్కడి టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ తో భారీ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. జస్ట్ రీసెంట్ గానే ముహూర్తం జరుపుకున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడ జరగనుందో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ నే విదేశాల్లో ప్లాన్ చేశారట.

మరి అలా ఈ ఫస్ట్ షెడ్యూల్ ను జార్జియా దేశంలో ప్లాన్ చేశారట. అలాగే ఆల్రెడీ విజయ్ నిన్న తన ఓటు వేసుకున్నాక ఈ షూట్ కి పయనం అయ్యినట్టు తెలుస్తుంది. మరి ఈ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :