వెంకీమామ కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ !

Published on Feb 20, 2019 8:44 am IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ల మల్టీ స్టారర్ వెంకీమామ షూటింగ్ ఈ వారంలో మొదలు కానుంది. బాబీ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటించనుండగా చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడుని ఖరారు చేశారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.

కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :