సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ‘A’ నుంచి సాంగ్ లాంచ్ చేసిన థమన్!‌

సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ‘A’ నుంచి సాంగ్ లాంచ్ చేసిన థమన్!‌

Published on Feb 17, 2021 4:00 PM IST

మామూలుగా ఏ సినీ వర్గానికి చెందిన వారు అయినా కూడా సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే ఎంతో ఇష్టపడతారు. మరి అలా లేటెస్ట్ గా ఓ సినిమా మంచి బజ్ ను సంతరించుకుంది అదే “A”. ఇప్పుడు దీని నుంచి ఓ సాంగ్ ను సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ‘‘సిలకా సిగురు సాటుకు పోకే.. . సెలికాని ఎద‌గూటికి రాయెజ‌డ కుచ్చుల‌లోన న‌ల‌గాల‌ని ఉందె, ఒడిలో త‌ల‌వాల్చి ఒద‌గాల‌ని ఉందె రాయె..” అనే పాటను విడుదల చేశారు.

ప్రియుడు త‌న ప్రియురాలి కోసం పాట పాడుకుంటే ఎలా ఉంటుంది. మ‌న‌సు క‌ర‌గ‌ని ప్రియురాలు ఉంటుందా..! త‌న ప్రేమ‌నంతా పాట‌లో కురిపించే ప్రియుడు మ‌న‌సు లోతును తెలుసుకోవ‌డానికి ప్రియురాలు ఏం చేసింది? అనేది తెలుసుకోవాలంటే ‘A’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు ద‌ర్శ‌కుడు యుగంధ‌ర్ ముని. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ‘A’. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ సినిమాలో విజ‌య్ కురాకుల సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమాలో ‘సిలకా సిగురు సాటుకు పోకే.. .’ పాట‌ను మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేసి సినిమా పెద్ద హిట్ కావాల‌ని యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. అనంతర శ్రీరామ్ రాసిన ఈ పాటను దీపు పాడారు. జానపదం స్టైల్లో సాగుతున్న పాట ప్రేకకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా విజ‌య్ సేతుప‌తి విడుద‌ల చేసిన ‘A’ ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తోంది. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 5న విడుద‌ల చేస్తున్నామ‌ని, ప్రేక్ష‌కులు మా సినిమాకు మంచి స‌పోర్ట్ అందిస్తూ వ‌స్తున్నారు. వారి అంచ‌నాల‌కు ధీటుగా సినిమా ఉంటుందని నిర్మాత గీతా మిన్సాల తెలిపారు.

ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్:ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్: బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్), ఎడిటింగ్: ఆనంద్ పవన్, మ‌ణి కందన్ (ఎఫ్‌టిఐఐ), సంగీతం విజయ్ కురాకుల, నిర్మాత; గీతా మిన్సాల,దర్శకత్వం; యుగంధర్ ముని లు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు