“ఏజెంట్” సినిమా నుంచి తప్పుకున్న తమన్..!

Published on Sep 3, 2021 2:08 am IST


అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ “ఏజెంట్”. ఈ సినిమా కోసం అఖిల్ మాస్ లుక్ తో కొత్తగా మేకోవర్ అవ్వడమే కాకుండా సిక్స్ ప్యాక్ బాడీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్ళింది. అయితే ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు తొలుత తమన్‌ని ఒకే చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం తమన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం తమన్ #RC15, గాడ్ ఫాదర్, మహేష్ బాబు28 వంటి సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా, “ఏజెంట్” సినిమా కోసం సమయం దొరకడం లేదని, ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలతో మాట్లాడి తమన్ తప్పుకున్నాడని సమాచారం. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ తమన్ ప్లేస్‌ని హిప్ హాప్ తమిజాతో రీప్లేస్ చేసుకున్నట్టు తెలుస్తుంది. “ధృవ” సినిమా తర్వాత సురేందర్ రెడ్డి సినిమాకు తమీజా సంగీతాన్ని అందించడం ఇది రెండో సారి. ఈ సినిమాలో అఖిల్ సరసన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని రామబ్రహ్మ సుంకర నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :