పిన్ చేసి మరీ పెట్టిన థమన్..’సర్కారు’ పై పెరుగుతున్న హీట్.!

Published on Aug 6, 2021 10:55 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ తర్వాత నుంచి భారీ అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. అంతే కాకుండా ఇప్పుడు రానున్న మహేష్ బర్త్ డే ట్రీట్ కి అయితే మహేష్ అభిమానులు ఏ లెక్కలో ఎదురు చూస్తున్నారో వారికే తెలుసు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ కూడా ఎప్పటికప్పుడు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాడు. మరి ఇప్పుడు కూడా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ అంటూ ఓ పోస్ట్ ని తన ట్విట్టర్ లో పిన్ చేసి మరీ పెట్టాడు. అలాగే ఖచ్చితంగా ఇది వీడియోతో కూడిన ట్రీట్ అనే కూడా హింట్ ఇస్తున్నాడు.

దీనితో ఇప్పుడు ఈ వీడియోలో థమన్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వనున్నాడా అని మరింత ఆసక్తి ఈ టీజర్ ని మించిన బ్లాస్టర్ పై నెలకొంది. మరి అంతకంతకూ హీట్ పెంచుకుంటూ వెళ్తున్న ఈ అప్డేట్ ఎలాంటి అవుట్ పుట్ ని అందిస్తుందో చూడాలి. మరి ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :