గెట్ రెడీ..సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ దిమ్మదిరిగేలా ఉందట.!

Published on Aug 8, 2021 8:37 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ వాటిని మరింత ఎక్కువ చేసే పనిలో పడ్డారు. ఈ నెల 9న మహేష్ బర్త్ డే కావడంతో అదిరే అప్డేట్స్ ఇస్తుండడమే కాకుండా బర్త్ డే రోజున సిసలైన బ్లాస్టర్ ని అందిస్తామని చెప్పారు. మరి దాని కోసం పీక్స్ లో మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు దాని ఫైనల్ కట్ చూసి ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నాడు.

తాను ఇప్పుడు సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ చూశానని.. అదొక బూమ్.. పొద్దున్నే నా బ్రెయిన్ లో అడ్రినలైన్ అంతా రష్ అయ్యిందని పచ్చిగా అయితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది అన్నట్టుగా థమన్ తన ఎగ్జైట్మెంట్ ని చెప్పుకొచ్చాడు.. అంతే కాకుండా మహేష్ గారు ఈ డేట్ న ట్విట్టర్ ని తన పేరిట కంట్రోల్ లో పెట్టేస్తారని కూడా చెప్పాడు. దీనితో రేపు రాబోయే ట్రీట్ పై అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి.. మరి ఈ బ్లాస్టర్ ఎలా ఉంటుందా అందరితో పాటు మాకు కూడా అసక్తిగానే ఉంది..

సంబంధిత సమాచారం :