
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’. ఈ సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చెయ్యడం కోసం రామ్ చరణ్, డైరెక్టర్ శ్రీను వైట్లతో పాటు టీం అందరూ ఎక్స్ట్రా టైం పని చేసి ఈ సినిమా అన్ని కార్యక్రమాలను ఫినిష్ చేసారు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ తమన్ కూడా ఈ సినిమా కోసం ఓవర్ టైం పనిచేసి బ్రూస్ లీ సాంగ్స్ మరియు రీ రికార్డింగ్ ని పూర్తి చేసాడు. అంతే కాదండోయ్ రీ రికార్డింగ్ విషయంలో తమన్ ఓ సరికొత్త రికార్డ్ ని కూడా సృష్టించాడు.
మాములుగానే అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే తమన్ వర్క్ ని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాడు అనే పేరుంది. సినిమాకి ఉన్న టైంని బట్టి తమన్ రీ రికార్డింగ్ ని కూడా చాలా ఫాస్ట్ గానే ఫినిష్ చేస్తుంటాడు. మామూలుగా అయితే తమన్ లేదా ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ రీ రికార్డింగ్ కోసం 15 – 30 రోజుల టైం తీసుకుంటారు. కానీ మొదటి సారి తమన్ కేవలం 9 రోజుల్లోనే బ్రూస్ లీ సినిమాని పూర్తి రీ రికార్డింగ్ వర్క్ ని ఫినిష్ చేసి టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ ని నెలకొల్పాడు. అక్టోబర్ 16న ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలనే టార్గెట్ వలన ఓవర్ టైం వర్క్ చేసి తమన్ ఇంత త్వరగా బ్రూస్ లీకి వర్క్ ని ఫినిష్ చేసాడు. కానీ క్వాలిటీలో ఎక్కడా తగ్గలేదని ఈ చిత్ర టీం తెలిపింది.
నిన్న సాయంత్రంతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ చిత్ర టీం ఈ రోజు బ్రూస్ లీ సినిమాని సెన్సార్ కార్యక్రమాల కోసం పంపనున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత.

